Operation Chevella : సీఎం రేవంత్ రెడ్డి “ఆపరేషన్ చేవెళ్ల” స్టార్ట్ చేశాడా..?

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 09:41 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందో..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లోను అలాగే విజయం సాధించాలని కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాల ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముందుగా ‘చేవెళ్ల’ లో ఆపరేషన్ స్టార్ట్ (Operation Chevella) చేసినట్లు పక్కాగా తెలిసిపోతుంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) తన కుటుంబంతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన మాత్రమే కాదు మరికొంతమంది మంది మాజీలతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం అతి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినికిడి. ఇందుకు కారణం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కి చేవెళ్ల ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ ఇవ్వబోతుండడమే.

We’re now on WhatsApp. Click to Join.

చేవెళ్ల పార్లమెంట్​లో చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అలాగే ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మహేందర్ రాకతో కాంగ్రెస్ బలం మరింత పుంజుకునే అవకాశాలు ఉండడం తో..అధిష్టానం సైతం మహేందర్ కు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందట. మరో పక్క మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్​గా ఉన్న తన కోడలు అనితా హరినాథ్ రెడ్డిని కూడా హస్తం గూటికి చేరబోతున్నారు. త్వరలోనే మహేశ్వరం నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు సమాచారం. ఇలా మొత్తం మీద రేవంత్ తన వ్యూహాలతో ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్నాడు.

Read Also : TDP Super 6 : సూపర్‌ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్