Congress Party : సింగరేణి కార్మికులకు కీలక హామీ ప్రకటించిన కాంగ్రెస్

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారన్న రేవంత్ రెడ్డి, సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీఆర్ఎస్(BRS) అంగీకరించిందన్నారు.

Published By: HashtagU Telugu Desk
T Congress Leaders Meet with Singareni Workers

T Congress Leaders Meet with Singareni Workers

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు కీలక హామీ ఇచ్చింది.. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పలు హామీలు అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్..తాజాగా సింగరేణి(Singareni) సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రేవంత్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకాలం ఒక్క అధికారినే సింగరేణికి సీఎండీగా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణి లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాలన్నారు. గండ్ర సత్యనారాయణ ఎన్నిసార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నారన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి సమస్యలు అన్ని పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలన్నారు.

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారన్న రేవంత్ రెడ్డి, సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీఆర్ఎస్(BRS) అంగీకరించిందన్నారు. గనుల బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిందని అన్నారు. సింగరేణి కార్మికుల త్యాగాలను సీఎం(TElangana CM) కేసీఆర్‌(KCR) మరిచిపోయారని విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులను రెగ్యులర్‌ చేస్తామన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలుపెట్టింది. నిన్న ములుగు జిల్లాలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర లో రాహుల్ , ప్రియాంక గాంధీ లు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు బస్సు యాత్ర .. భూపాలపల్లి నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుంది. రాహుల్ రోడ్ షో (Rahul Road Show) చేస్తూ పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లలో పాల్గోనున్నారు. తొలుత భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. కాటారంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులతో రాహుల్ సమావేశం అవుతారు. రైతులకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే పథకాలను వారికి వివరిస్తారు. రుణమాఫీ, రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల సాయం, మద్దతు ధర, ఇతర పథకాల గురించి రాహుల్ రైతులకు తెలియజేయనున్నారు. అనంతరం అక్కడే రైతులతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేస్తారు. అనంతరం రాహుల్ గాంధీ (Rahul Gandhi ) మంథనికి వెళ్తారు. అక్కడ కాళేశ్వరం ముంపు బాధితులతో సమావేశం అవుతారు. అక్కడ సింగరేణి అతిథి గృహం వద్ద సింగరేణి కార్మికులతో రాహుల్ భేటీ అవుతారు. కార్మికులతో చర్చల తరువాత బస్సు యాత్ర కొనసాగిస్తారు. ఈ క్రమంలో కమాన్ పూర్ క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4గంటలకు పెద్దపల్లిలోని జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు కరీంనగర్ లో పాదయాత్ర, కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొంటారు.

Read Also : BRS Joins: గద్వాల్ కాంగ్రెస్ కు భారీ షాక్, హరీశ్ రావు సమక్షంలో కీలక చేరికలు

  Last Updated: 19 Oct 2023, 11:43 AM IST