BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని ఆరోపించారు. ధాన్యం అకాల వర్షాలతో తడిసినా కొనే నాథుడే కరువయ్యాడని, ప్రభుత్వ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వారు విమర్శించారు.
‘‘ఈ ప్రభుత్వానికి బీ ఆర్ ఎస్ నేతృత్వం లో రైతులు ఆందోళన చేసినా కనికరం లేదు. రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని, అన్నిటికీ షరతులు వర్తిస్తాయి అనే విధంగా రేవంత్ పాలన ఉందని, బోనస్ సన్న వడ్లకే వర్తించేలా ఈ ప్రభుత్వం పావులు కదుపుతోంది అని, దేవుళ్ళ మీద ఒట్లు తప్ప ప్రభుత్వానికి ఏదీ చేత కావడం లేదు. .ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం సన్న గిల్లింది’’ అని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీ ఆర్ ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ప్రజా పాలన అన్నారు ..సీఎం రేవంత్ తీరు చూస్తుంటే పన్నుల పాలన తెచ్చేట్టుగా ఉన్నారు. ఎన్నికలు ముగియగానే ఎడా పెడా వడ్డనలు మోపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ..ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజులు వసూలు చేయమని వసూలు చేస్తున్నారు. ఎన్నికల్లో బెల్ట్ షాపులు తగ్గిస్తామని చెప్పి ఇపుడు మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని స్వయంగా సీఎం అధికారులను ఆదేశిస్తున్నారు’’ వారు ఫైర్ అయ్యారు.