Renuka Chowdhury : బ్యారేజ్ లు కూలుతుంటే…బిఆర్ఎస్ డ్రామాలు చేస్తుంది – రేణుకా చౌదరి

  • Written By:
  • Updated On - February 15, 2024 / 01:57 PM IST

పెద్దల సభకు ఎన్నికైన మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury)..బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫై నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ కట్టిన బ్యారేజ్ కూలుతుంటే..దానిపై సమాధానం చెప్పాలని అడుగుతుంటే..అసెంబ్లీ లో డ్రామాలు ఆడుతుందని రేణుకా ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లను బుధువారం అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది.

ఈ ప్రకటన ఫై రేణుకా స్పందిస్తూ… ఈ అవకాశం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా తనకు అవకాశం లభించిందన్నారు. సోనియా గాంధీ (Soniya Gandhi), కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన గుర్తింపు కాదు… ఖమ్మంలో కాంగ్రెస్ జెండా నీ వదలకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఇచ్చిన గుర్తింపు అన్నారు. మా అధినేత సోనియా గాంధీతో పాటు పెద్దలసభలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్ లో ప్రస్తుతం చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది… స్టాండర్డ్స్ మారిపోయాయని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అవన్నీ ఇప్పుడు మారబోతున్నయని అనుకుంటున్నామన్నారు. సభలో సభ్యులను, ఆడవాళ్ళను… భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇక ఆ పప్పులు సాగవన్నారు. ఇక రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో మా పైన విరుచుకుపడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నాం… బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని రాజకీయాలు చెయ్యొచ్చు…దేశంలో ప్రజలకు అన్నం పెడుతున్న రైతులు ఉద్యమాలు చెయ్యవద్దా? అని ప్రశ్నించారు. అంత పెద్దయెత్తున ప్రజల డబ్బు ఖర్చుపెట్టి బారికెడ్స్ ఏర్పాటు చేసి రైతు ఉద్యమాలను అణిచివేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బదులు ఒక మంత్రి నీ పంపి చర్చలు జరపవచ్చు కదా? అని ప్రశ్నించారు. వీటన్నిటికీ రైతులు, ప్రజలు రాబోయే కాలంలో బుద్దిచెబుతారని తెలిపారు.

Read Also : Berberine: షుగర్ కంట్రోల్ కాకపోతే ఈ ఆయుర్వేద జ్యూస్ తాగాల్సిందే..!