Rythu Bharosa: సీఎం రేవంత్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రూ. 2 లక్షల రుణమాఫీ పథకం విజయవంతంగా అమలుచేసిన కాంగ్రెస్ సర్కార్ మరో రైతుకు ప్రయోజనం చేకూరే పథకంపై వర్క్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా (Rythu Bharosa)పై నేడు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రైతుభరోసా ఎప్పుడూ వస్తుందా అని తెలంగాణ రైతాంగం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రైతు భరోసా కేవలం 5 నుంచి 7 ఎకరాల పొలం ఉన్న రైతులకే అని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి ప్రకటన వెలువడలేదు. అలాగే రైతు భరోసా విధివిధానాలు తెలియాల్సి ఉంది.
నేడు రైతు భరోసాపై సబ్ కమిటీ సమావేశం
రైతు భరోసాపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. శాటిలైట్ డేటా ఆధారంగా రైతుల సాగు విస్తీర్ణాన్ని లెక్కించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించనున్నారు. జనవరి 4న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై క్లారటీ రానుంది.
Also Read: Manchu Vishnu : మంచు విష్ణు సంచలన పోస్ట్.. తమ్ముడి కోసమేనా ?
సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?
రైతులకు సంక్రాంతికి కానుక ఇచ్చేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. అయితే ఇప్పటికే సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి తర్వాత రైతు భరోసా విడుదల చేస్తామని తెలిపిన ప్రభుత్వం తాజాగా సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేసి రైతులకు సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 15 వేలు సాయం అందించనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 వేలు అందించిన విషయం తెలిసిందే.