Sitaram Yechury Died : సీపీఎం (CPM) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన శ్వాసకోస సమస్యతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమమం అయ్యి..గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సీతారం ఏచూరి మరణ వార్త ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. సీతారం తో ఉన్న అనుబంధాన్ని ఆయన చేసిన కృషి పట్ల రాజకీయ నేతలంతా స్పందిస్తూ..ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని.. ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని సీఎం రేవంత్ అన్నారు.
సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ (KCR) విచారం వ్యక్తం చేశారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Also : Spam Calls : స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్.. ఏకమవుతున్న టెల్కోలు