Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డి

Telangana (41)

Telangana (41)

Telangana: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే నర్సంపేట టికెట్‌ను దొంతి మాధవరెడ్డికి కేటాయించిన కాంగ్రెస్‌ పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి 1994, 1999, 2009లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 2018లో వరంగల్ పశ్చిమ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి దాస్యం వినయభాస్కర్ చేతిలో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు.

అక్టోబరు 15, 2023న రేవంత్ రెడ్డి, మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రేవూరి ప్రకాష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ తరుపున రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కొండా సురేఖ, ఇనుగాల వెంకట్రామి రెడ్డి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: Thamalapaku Rasam : తమలపాకులతోనూ ఇలా రసం చేసుకుని.. అన్నంలో తినొచ్చు !