టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి (Ravula Chandra Shekar Reddy)..కేటీఆర్ (KTR) సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ..చంద్రశేఖర్ రెడ్డి ఫై గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ (TDP) పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని గులాబీ గూటికి చేరారు చంద్రశేఖర్.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రావుల.. ప్రస్తుతం టీడీపీ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. కానాయ పల్లి గ్రామ సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో చేరి. అంచెలంచెలుగా ఎదిగారు. 1989 -1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో వనపర్తి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికలలో ఓడినా.. 2001లో రాజ్యసభ సభ్యునిగా ఆయన్ను టీడీపీ నామినేట్ చేసింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణ ఆవిర్బావం తర్వాత.. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా.. చంద్రబాబుకు నమ్మకంగా ఉంటూ ఆ పార్టీలోనే కొనసాగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించగా.. ఆయన మాత్రం బిఆర్ఎస్ లో చేరారు.రాష్ట్రంలో టీడీపీ బలపడకపోవటం, ఎల్ రమణ, ఎర్రబెల్లి వంటి సహచర నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి అధికార పార్టీలో చేరటంతో ఇక లాభం లేదని భావించి..చివరకు ఆయన కూడా వారి బాటలోనే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also : Cheruku Sudhakar : కాంగ్రెస్ పార్టీ కి మరో కీలక నేత రాజీనామా