Site icon HashtagU Telugu

Revanth Reddy: హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదు, కేసీఆర్ చేసిన హత్య: రేవంత్ రెడ్డి

Revanth Reddy

Telangana Congress announced SC ST Declaration in Chevella Praja Garjana Sabha

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో డీజీపీని కలిశారు. హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. హోంగార్డు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్య, కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత రెడ్డి నొక్కి చెప్పారు. రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలి.కుటుంబంలోఒకరికి ఉద్యోగం, 25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే 16, 17 న తాజ్ కృష్ణ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని, 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా పరిహారం అందేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్‌ల కంటే అధ్వానంగా ఉందని రేవంత్ అన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే హోంగార్డులు ఎలా బతకాలని లేఖలో ప్రశ్నించారు. హోంగార్డు రవీందర్ ను ఉన్నతాధికారులు వేధించారన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారులు, తోటి సిబ్బంది వేధింపులతో హోంగార్డు రవీందర్ అత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని కలిగిచిందన్నారు. రవీందర్ భార్యాపిల్లలకు దిక్కెవరని రేవంత్ ప్రశ్నించారు. ఇంత జరిగినా ఏ ఒక్క మంత్రిగాని, అధికారిని స్పందిచకపోవడం మరింత దారుణం. రవీందర్‌ది ఆత్మహత్య కాదని… ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. 2017లో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని రేవంత్ విమర్శించారు.

Also Read: Medical Colleges: తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధం!