Site icon HashtagU Telugu

Upasana : HCU అటవీ భూములపై వివాదం.. స్పందించిన రామ్ చరణ్ భార్య..

Ram Charan Wife Upasana React o HCU Forrest Land Issue

Ram Charan Wife Upasana React o HCU Forrest Land Issue

Upasana : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చుట్టూ ఉన్న 400 ఎకరాల భూమి వివాదం ప్రస్తుతం నేషనల్ వైడ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగించాలని ప్రతిపాదించింది. అయితే ఇది అటవీ భూమి అని, అందులో ఎన్నో చెట్లు, పక్షకులు, జంతువులు ఉన్నాయని విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవాదులు, ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే రేణు దేశాయ్, రష్మీ గౌతమ్, నాగ్ అశ్విన్.. పలువురు HCU భూ వివాదంపై ఆ అడవిని, జంతువులను కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ మాట్లాడగా తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన తన సోషల్ మీడియాలో దీనిపై ఓ పోస్ట్ పెట్టింది.

ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో HCU వివాదానికి సంబంధించిన ఓ పోస్ట్ షేర్ చేసి.. ఇది నిజంగా జరిగితే అక్కడి పక్షులు, జంతువులు ఎక్కడికి తరలిస్తారు? అక్కడి చెట్లను మళ్ళీ ఎక్కడ నాటుతారు. ఆ ప్లాన్ అందరికి చెప్పండి అంటూ ప్రశ్నించింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరింతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది.

Also Read : Renu Desai: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం.. స్పందించిన రేణూ దేశాయ్!