Rajiv Park : మన హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. అమెరికాలోని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్‌లో 4100 ఎకరాల్లో రాజీవ్ పార్క్‌ను డెవలప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పార్క్ చుట్టూ ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ ఏరియాలో 843 ఎకరాల్లో ఉన్న సెంట్రల్ పార్క్‌ను చూసి చాలా ఆనందానికి ఫీలయ్యారు. ఏటా దాదాపు 4.2 కోట్ల మంది పర్యాటకులు ఆ పార్క్‌ను(Rajiv Park)సందర్శిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆ పార్కులోనే సినిమా షూటింగ్ స్పాట్లు, ఫారెస్ట్, థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ జోన్స్, జూ వంటివి ఉండటాన్ని సీఎం చూశారు. పార్కులో వాక్‌వేలు, సైక్లింగ్, క్రీడా సౌకర్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక డయాస్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూశాక.. అలాంటిదే ల్యాండ్‌స్కేప్ పార్కు మన హైదరాబాద్‌లో కూడా ఉంటే బాగుంటుందని సీఎం రేవంత్ భావించారు. హైదరాబాద్‌లో 4100 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్న రాజీవ్ పార్కు చుట్టూ నిర్మించే భవనాల్లో విశాలమైన లాంజ్‌లు, జిమ్, సెలూన్, స్పా, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ ఔట్‌డోర్ స్పేస్ వంటి వసతులు ఉంటాయి.
హైదరాబాద్‌లో నిర్మించనున్న రాజీవ్ పార్కులో షాంఘై, దుబాయ్, టోక్యో వంటి నగరాల్లో ప్రసిద్ధి చెందిన అబ్జర్వేటరీ డెక్‌లను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారట. ఈ డెక్‌లను వాడుకొని సందర్శకులు చాలా హైట్ నుంచి సిటీ మొత్తాన్ని వ్యూ చేసే వెసులుబాటు కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ ప్రస్తుతం చైనాలోని షాంఘై టవర్‌లో ఉంది. దాని ఎత్తు 562 మీటర్లు. ఇలాంటివన్నీ రాజీవ్ పార్కులో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం స్కైలైన్‌ను చాలా క్లియర్‌ను మనమంతా చూసి ఎంజాయ్ చేయొచ్చు.