బిజెపి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి (Telangana BJP Chief) ప్రకటించిందో లేదో పార్టీలో నిరసనలు జ్వాలలు మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. హిందుత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే నేతలకే పార్టీ పగ్గాలను ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తల అభిమతాన్ని గౌరవిస్తూ తనను పార్టీ అధ్యక్ష పదవికి పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. “గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తాను, హిందుత్వం కోసం పని చేసే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తాను” అంటూ పార్టీ వర్గాలపై స్వల్ప విమర్శలు కూడా చేశారు.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు
“నిజంగా పార్టీకోసం పనిచేసిన నన్ను పక్కనపెట్టి, వీఐపీలా ఉండే వారిని పదవులకు నియమించడం పట్ల నిరాశతోనే రాజీనామా చేస్తున్నాను” అని స్పష్టం చేశారు. తన రాజీనామా వెనుక పార్టీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి ఉందని వివరించారు. “నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను” అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ అంశంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్నది వేచి చూడాల్సిన విషయం.
Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఇక మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. “వ్యక్తిగత కారణాలతో పార్టీకార్యక్రమానికి హాజరుకాలేను” అంటూ X (ట్విటర్) వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాదన్న ఊహగానాలే కారణమా? అన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు దిశగా కదులుతున్న వేళ, కీలక నేతల విభేదాలు పార్టీ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశముంది.