Rajagopal Reddy: తెలంగాణలో అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ పార్టీకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, మరోవైపు ఉన్న నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్తుండటం తలనొప్పిగా మారింది. తాజాగా బీజేపీ నేత కోమటిరెడి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు.
వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం వీరు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి చేరిక సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఉండటం విశేషం.
ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటే పార్టీలో చేరిక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వీరు భేటీ కానున్నారు. కాంగ్రెస్ లో పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు తోపాటు కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: BRS Party: భారత రాష్ట్ర సమితిలో చేరిన మాజీ టీచర్ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి