తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీఆరామనవమి సందర్భంగా రాజాసింగ్ నిర్వహిస్తున్న శోభాయాత్రకు పోటీగా గౌతం రావు మరో యాత్ర చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతం రావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడంతో, పార్టీ నిర్ణయంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
HCU : జింకపై దాడి చేసిన కుక్కలు..జంతు ప్రేమికుల ఆవేదన
రాజాసింగ్ ఆరోపిస్తూ.. “మేకప్ మెన్‌లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు. పార్టీకి నిజమైన పని చేసిన వారిని విస్మరిస్తున్నారు” అని మండిపడ్డారు. గతంలో మాధవిలతను హైద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించగానే కూడా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “పార్టీకి మగాళ్లు దొరకలేదా?” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు గౌతం రావు పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి, గౌతం రావు ఫ్లెక్సీలు వేయడం కూడా రాజాసింగ్‌కు మింగుడు పడలేదు. తన నిర్వహిస్తున్న శోభాయాత్రను అడ్డుకోవడం మీ అయ్యతరం కూడా కాదంటూ విమర్శించారు. ఈ పరిణామాలతో బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశముంది. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరిగిన వేళ, ఈ వివాదం ఎన్నికల వేళ బీజేపీకి తీవ్ర మైనస్‌గా మారే ప్రమాదం కనిపిస్తోంది.