Rains Alert: మూడురోజులు వర్షాలు.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన

ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉంది.

  • Written By:
  • Updated On - July 25, 2024 / 09:06 AM IST

Rains Alert: ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉంది. ఈవివరాలను జూలై 24న హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు(Rains Alert) వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో.. 

ఇవాళ, రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.  కొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఈ వానల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు.

Also Read :YS Jagan Vs BJP : ఇక బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ? ఏపీలో మారనున్న సమీకరణాలు!

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు నగరంలో  ఆకాశం మేఘావృతమై ఉంటుంది. బుధవారం రోజు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 85 శాతంగా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌లోని(AP Rains) ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాలలో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

Also Read :IBPS Clerks : 6వేల ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

Follow us