Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు

Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 07:41 AM IST

Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.  నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల  వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో  పాటు గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Also read : Niger Coup : నైగర్‌ అధికార పార్టీ ఆఫీసుకు నిప్పు.. సైనిక తిరుగుబాటుతో ఉద్రిక్తత

గోదావరి వరద ప్రమాద హెచ్చరిక 

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద మరో రెండు రోజులు వరకు క్రమంగా పెరుగుతుందని ఏపీ విపత్తుల సంస్థ(Rain Alert Today) తెలిపింది. గోదావరి వరద ప్రమాదానికి సంబంధించిన  రెండో హెచ్చరికను జారీ చేశామని, దానివల్ల ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాల్లోని 458 గ్రామాలను నిరంతరం  అప్రమత్తం  చేస్తున్నామని పేర్కొంది. అత్యవసర సహాయక చర్యలకోసం 3 NDRF, 4 SDRF బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ  చెప్పింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 1.42 లక్షల ఔట్ ఫ్లో ఉందని కృష్ణా లొతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు  1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.

Also read : IND vs WI: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం