Highest Railway Platforms : హైదరాబాద్ మహానగరం పరిధిలోని చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రూ.428 కోట్లతో దీన్ని రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా ఇక్కడి నుంచి గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక్కడి నుంచి 24 రైళ్లు నడవనున్నాయి. ఈ స్టేషనులో ఐదు లిఫ్టులు ఉన్నాయి. తొమ్మిది ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈనేపథ్యంలో దేశంలో అత్యధిక ప్లాట్‌ఫామ్‌లు కలిగిన రైల్వే స్టేషన్ల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మనం ఇప్పుడు దేశంలో ఎక్కువ ప్లాట్ ఫామ్‌లు కలిగిన రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాం. ఈ వివరాల ఆధారంగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పరంగా చర్లపల్లి రైల్వే స్టేషను స్థానం ఎంతో మనకు తెలిసిపోతుంది.
Also Read :Mohan Babu : జర్నలిస్ట్‌పై దాడి కేసు.. సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు షాక్
- మన దేశంలో అత్యధిక ప్లాట్‌ఫామ్‌లను కలిగిన రైల్వే స్టేషను ఏదో తెలుసా ? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. 1854 సంవత్సరంలో ప్రారంభమైన ఈ రైల్వే స్టేషనులో 23 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇది మనదేశంలోని అత్యంత పురాతన రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఇది తూర్పు భారత దేశాన్ని ఇతర ప్రాంతాల్లోని రైలు మార్గాల ద్వారా అనుసంధానిస్తుంది.
Also Read :RTC : ఆర్టీసీలో 3వేల నియామకాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా రైల్వే స్టేషనులో 21 ప్లాట్‌ఫామ్‌లు(Highest Railway Platforms) ఉన్నాయి. ఇది కోల్‌కతా నగరంలోని ప్రధాన రైల్వే టర్మినల్. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఈ టర్మినల్ లింక్ చేస్తుంది. కోల్‌కతా మెట్రోకు సైతం ఈ స్టేషను నుంచి కనెక్టివిటీ ఉంది. కోల్‌కతా మెట్రో లైన్ 2లో ఇది ఒక స్టాప్.
- మహారాష్ట్రలోని ముంబైలో ఛత్రపతి శివాజీ స్టేషన్ ఉంది. ఇందులో 18 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్‌ను 1887 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక్కడి నుంచి రోజూ ఏడు లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఈ స్టేషను నుంచి ముంబై మెట్రోకు కనెక్టివిటీ ఉంది.
- చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషనులో 22 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్‌ను 1873లో ప్రారంభించారు. దీని మీదుగా రోజూ 3,50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ స్టేషన్‌ను దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారంగా పిలుస్తారు.
- న్యూఢిల్లీ రైల్వే స్టేషనులో 16 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. దీన్ని 1956 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ స్టేషను మీదుగా రోజూ 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ స్టేషన్ కూడా ఢిల్లీ మెట్రోకు అనుసంధానమై ఉంటుంది.