Rahul – Priyanka Telangana Tour : ఈ నెల 17 న తెలంగాణ కు రాహుల్ రాక..వారం పాటు ప్రచారం

ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్‌గాంధీ ఆరురోజులపాటు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు

Published By: HashtagU Telugu Desk
Rahul Priyanka Ts

Rahul Priyanka Ts

తెలంగాణ (Telangana) లో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరాలని కాంగ్రెస్ (Congress) అధిష్టానం పట్టుదలతో ఉంది. దానికి తగ్గట్లే పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లోకి రప్పించుకోవడం లోనే కాదు..గ్యారెంటీ హామీలతో..ప్రచారం తో కాంగ్రెస్ తన దూకుడు ను కనపరుస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉన్న నేతలు ప్రచారంలో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఓ పక్క లోకల్ నేతలు పర్యటిస్తుండగానే..మరోపక్క జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే రాహుల్ (Rahul Gandhi) , ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా..మరోసారి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న రాహుల్ గాంధీ రానుండగా.. ఈ నెల 20న ప్రియాంకగాంధీ రానున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్‌గాంధీ ఆరురోజులపాటు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 17 న వరంగల్‌, పాలకుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టాలన్న షెడ్యూల్‌పై రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ ప్రచారంలో భాగంగా నిరుద్యోగులతో భేటీకానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు కొందరు రెండు బృందాలుగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 10 రోజులపాటు నిరుద్యోగ చైతన్యం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.

రాహుల్‌ పర్యటన సమయంలోనే ప్రియాంకగాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 20 తర్వాత సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలోని పలుచోట్ల 5 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇలా వరుసగా నేతలు పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోనున్నారు.

Read Also : CM KCR- Revanth Reddy : ఈరోజు పాలకుర్తి‌లో కేసీఆర్ ..స్టేషన్ ఘనపూర్‌లో రేవంత్ పర్యటన

  Last Updated: 14 Nov 2023, 11:18 AM IST