తెలంగాణ ఎన్నికల ప్రచారం (telangana Election Campgin)లో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)..బోధన్, ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ (Congress Vijaya Bheri Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ (KCR), మోడీ (Modi) లపై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ ప్రధాని మోడీ చేతిలో ఉందని.. రిమోట్‌లోని ఒక్కో బటన్‌లో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని.. అయితే ఆ బటన్లను కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు కోసం మాత్రం ఉపయోగించరన్నారు. మోడీ ఆ రిమోట్‌ను చూపించగానే కేసీఆర్ కూర్చుండిపోతారని ఆరోపించారు.
తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని … తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలిస్తున్నారన్నారు. ప్రజలు కన్న కలలు, అమరుల ఆశయాలు నెరవేరట్లేదన్నారు. వందలాది మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణా ఏర్పడిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిందన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అప్పుల కుప్పగా మారిందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు కేవలం హామీలు మాత్రమే కావని.. ప్రభుత్వం ఏర్పాడ్డాక తొలి మంత్రిమండలి సమావేశంలోనే చట్టాలుగా మారుస్తామని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వనిదే దళితబంధు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని, పేదల భూములను లాక్కోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారన్నారు. దొరల తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందని ధ్వజమెత్తారు.
మహిళలకు, రైతులకు ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ముఖ్యంగా మహిళలు లేకుండా సమాజాన్ని ఊహించలేమన్నారు. ఇవాళ 1200గా ఉన్న గ్యాస్ సిలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 500లకే సరఫరా చేస్తామన్నారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమన్నారు. వివాహమైన మహిళలకు నెలకు 2500లు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వృద్ధులకు నాలుగు వేల పింఛన్ ప్రతినెల అందిస్తామన్నారు. తెలంగాణాలో రైతు ఆత్మహత్యలను చూడటానికి మేము సిద్ధంగా లేమని, రైతులు భయంతో జీవించటం మేము ఇష్ట పడట్లేదని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తామని భరోసా కల్పించారు.
Read Also : Rajasthan Election 2023 Polling : రాజస్థాన్ కా రాజా కౌన్..?