తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో TPCC చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపు (నవంబర్ 05) హైదరాబాద్‌కు రాబోతుండడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) నుండి బోయిన్‌పల్లి (Boinpally) వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఐడియాలజీ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయడానికి భారీ జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేపట్టారు. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జన సమీకరణ కోసం ఇంఛార్జీలను నియమించారు.
రేపటి (నవంబర్ 05) రాహుల్ షెడ్యూల్ (Rahul Gandhi Hyderabad Schedule ) చూస్తే..
రాయ్‌బరేలీ, ఉత్తరప్రదేశ్ :-
09:30 – 10:30: ఢిల్లీ నుంచి ఫుర్సత్‌గంజ్‌కు ప్రత్యేక విమానంలో రాహుల్ ప్రయాణం.
10:35 – 11:00: ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయం నుంచి డిగ్రీ కాలేజ్ చౌరస్తా, రాయ్‌బరేలీకి రోడ్ మార్గంలో ప్రయాణం.
11:00 – 11:20: రాయ్‌బరేలీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన షహీద్ చౌక్ ప్రారంభోత్సవం.
11:30 – 14:30: బచత్ భవన్‌లో DISHA సమావేశం.
14:30 – 14:50: రోడ్ మార్గంలో బచత్ భవన్ నుంచి ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయానికి వస్తారు.
15:00 – 16:45: ఫుర్సత్‌గంజ్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు.
17:00 – 17:20: బేగంపేట్ నుంచి బోయిన్‌పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు రోడ్ మార్గంలో వెళ్లనున్నారు.
17:30 – 18:30: కుల గణనపై రాష్ట్ర స్థాయి సంప్రదింపులు చేస్తారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లు హాజరు అవుతారు.
18:30 – 19:00: గాంధీ ఐడియాలజీ సెంటర్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం.
19:10 – 21:00: ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం.
Read Also : Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ ఛాన్స్ ఎవరికి ఉంది..!