Site icon HashtagU Telugu

Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖ‌కు రాహుల్ గాంధీ ప్ర‌తిస్పంద‌న‌.. ఏమ‌న్నారంటే?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తెలంగాణలో ఏడాది పాలనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ లేఖపై తాజాగా రాహుల్ స్పందించారు. ‘‘హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. రవాణాశాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ చేపట్టిన కార్యక్రమాలను నేను అభినందిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అంటూ పొన్నంకు రాహుల్ గాంధీ లేఖ రాశారు.

మీ నాయకత్వంలో ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తు విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఆ లేఖ‌కు ప్ర‌తిస్పంద‌న రాహుల్ గాంధీ మ‌రో లేఖ పంపారు.

Also Read: Fact Check : మండుతున్నది కుర్‌కురే పొడి కాదు.. అమోనియం డైక్రోమేట్

రాహుల్ గాంధీ త‌న లేఖ‌లో ఏం రాశారంటే..

రాహుల్ గాంధీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి రాసిన లేఖలో.. హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. రవాణా శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలను నేను అభినందిస్తున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా దార్శనికతను సాకారం చేసే దిశగా మీరు నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లేఖ సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.