Bharat Jodo Yatra: `భాగ్య‌న‌గ‌రం`లో భార‌త్ జోడో

భాగ్య‌న‌గ‌రం అంతటా భార‌త్ జోడో యాత్ర హ‌డావుడి క‌నిపిస్తోంది. రాత్రి ఏడు గంట‌ల‌కు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హం ద‌గ్గ‌ర జ‌రిగే బ‌హిరంగ స‌భ వైపు ఆస‌క్తిగా చూస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:58 PM IST

భాగ్య‌న‌గ‌రం అంతటా భార‌త్ జోడో యాత్ర హ‌డావుడి క‌నిపిస్తోంది. రాత్రి ఏడు గంట‌ల‌కు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హం ద‌గ్గ‌ర జ‌రిగే బ‌హిరంగ స‌భ వైపు ఆస‌క్తిగా చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు హైద‌రాబాద్ కు చేరుకున్నారు. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు చేస్తోన్న భార‌త్ జోడో యాత్ర హైద‌రాబాద్‌కు చేరుకోవ‌డంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడ‌ర్ ఉత్సాహంగా ముందుకు క‌దులుతోంది.

శంషాబాద్ నుంచి కాలేజి విద్యార్థులతో కలిసి రాహుల్ పాద‌యాత్ర చేస్తున్నారు. విద్యార్థుల‌తో ముచ్చ‌టిస్తూ యాత్ర ముందుకు సాగుతోంది. శంషాబాద్ వద్ద ఒక విద్యార్థిని మాట్లాడి ఆమె భరత నాట్యం వస్తుందని తెలుసుకొని ఆమె చేసిన క్లాసికల్ డ్యాన్స్ ను తిలకించి ఆ విద్యార్థిని అభినందించారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తదితరులు ఉన్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు.

Also Read:  AP Formation Day: నిరాడంబ‌రంగా ఏపీ అవ‌త‌ర‌ణ వేడుక‌లు

రాజేంద్ర నగర్ నుండి శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు కొనసాగనున్న రాహుల్ గాంధీ యాత్ర కాంగ్రెస్ క్యాడ‌ర్ ను ఉత్సాహ ప‌రుస్తోంది. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతూ దారిపొడవునా జెండాలు, ఫ్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ప్ర‌ద‌ర్శించారు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపు పాదయాత్ర జరిగే మూడు కిలోమీటర్ల రేడియస్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగ‌ళ‌వారం నుంచి రెండు రోజులపాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నగరంలో కొనసాగుతోంది. ఆ నేప‌థ్యంలో ట్రాఫిక్ ను కొన్ని ప్రాంతాల్లో మళ్ళించాఉఉ. రెండు రోజులపాటు యాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. మంగ‌ళ‌వారం నాడు ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నక్లెస్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.

Also Read:  Munugodu Elections: మునుగోడు క్లైమాక్స్ హోరు

ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకూ యాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ ను ఇతర ప్రాంతాల మీదుగా మళ్ళించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే ప్రాంతాలలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ బుధ‌వారం పాదయాత్ర చేసే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయ‌ని పోలీస్ వెల్ల‌డించింది.