MLC By Elections : రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ కుట్ర.. ఈసీకి రఘునందన్ కంప్లయింట్

బీఆర్ఎస్​పై మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు.

  • Written By:
  • Updated On - May 26, 2024 / 04:04 PM IST

MLC By Elections : బీఆర్ఎస్​పై మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ఆయన ఆరోపించారు. డబ్బులు పంచి గెలవాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. వెంటనే బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు కొనాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్​కు రఘునందన్​రావు ఈమెయిల్​ ద్వారా ఫిర్యాదును పంపారు.

We’re now on WhatsApp. Click to Join

ఓ బ్యాంక్‌లోని బీఆర్ఎస్ పార్టీ అకౌంటు నుంచి 30 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు కోటి చొప్పున డబ్బును పంపాలని బీఆర్ఎస్ భావిస్తోందని రఘునందన్‌ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఈసీకి అందించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాను ఫ్రీజ్‌ చేయాలని కోరారు. డబ్బు ద్వారా ఎమ్మెల్సీ బైపోల్‌లో గెలవాలని బీఆర్ఎస్ పార్టీ భావించడం ఆందోళనకరమన్నారు.

Also Read :Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్

రేపు (సోమవారం రోజు) వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది సెక్టోరియల్ అధికారులు, 39 మంది ప్రిసైడింగ్ అధికారులు, 137 మంది పోలింగ్ సిబ్బంది, 40 మంది సూక్ష్మ పరిశీలకులు విధులు నిర్వహిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు.

Also Read : Human Milk : తల్లి పాల విక్రయాలు ఆపేయండి : ఎఫ్ఎస్ఎస్ఏఐ