Site icon HashtagU Telugu

TRS MLA’s Quit Please: సార్ ప్లీజ్ రిజైన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్!

Trs Mlas

Trs Mlas

గతంలో ఏ పార్టీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా పట్టణాలు, పల్లెలు అభివృద్ధి జరుగుతుండేవి. అయితే ప్రభుత్వాలతో పాటు పాలకులు మారుతుండటంతో ఓటర్లు ఆలోచనలు సైతం మారుతున్నాయి. తమ తమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలతోనే సాధ్యమవుతుందని తెలంగాణ ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉదాహరణే.. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు.

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త సమస్య తెచ్చిపెట్టింది. మునుగోడులో బిజీబిజీగా ప్రచారంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లోని కొంతమంది ఓటర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నియోజకవర్గంలో వరుస అభివృద్ధి కార్యక్రమాలు జరుగాలంటే.. తాము కూడా లాభపడాలంటే రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ చేసిన వారిలో వార్డు మెంబర్లు కూడా ఉన్నారని చెబుతున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాట్రేయాల్ గ్రామానికి చెందిన రేవంత్ ఫోన్ చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆమె చెప్పడంతో ‘రాజీనామా చేస్తే కాట్రేయల్‌ గ్రామాభివృద్ధికి మీరు పెద్దపీట వేస్తారు’ అని చెప్పినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఫోన్‌ను డిస్‌కనెక్ట్‌ చేయాల్సిన పరిస్థితి.

Also Read:  Bharat Jodo Yatra: జోడో యాత్రలో మాజీ మంత్రికి గాయం.!

నర్సాపూర్ నియోజకవర్గంలోని నవాబుపేట ఎస్ అశోక్ అనే వ్యక్తి ఆ ప్రాంత ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. మీరు రాజీనామా చేస్తే నియోజకవర్గంతో పాటు తాము కూడా అభివృద్ధి చెందుతాం” అని అడిగాడు. విస్మయానికి గురైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావుకు మణియార్‌పల్లి అక్రమ్‌షా నుంచి వార్డు మెంబర్‌ ఫోన్‌ చేసి.. ‘ఒక్క చిన్న విన్నపం.. పర్వాలేదు, మీరు రాజీనామా చేస్తే మేం ప్రయోజనం పొందుతాం’ అని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా వద్దా అని కేటీఆర్‌ను అడుగుతానని సమాధానమిచ్చారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాజీనామా చేయాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆ ప్రాంత ఓటర్లు సూచించారు. దీనికి ఎమ్మెల్యే ‘సరే అన్నయ్యా’ అని బదులిచ్చారు. ఉపఎన్నికలు వస్తే ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు నియోజక వర్గాలపై లాభాల వర్షం కురిపిస్తారనే భావనలో ప్రజల్లో ఉన్నారని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మునుగోడు నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఉదాహరణకు సీఎం కేసీఆర్ బహిరంగ సభకు స్థలాన్ని ఎంపికతో చండూరులో రోడ్లు డెవలప్ చేశారు. కొంతమంది కొత్త దరఖాస్తుదారులు పింఛన్లు, ఇతర ప్రోత్సాహకాలను పొందారని నాయకులు తెల్పడం గమనార్హం.

Also Read:  TS : హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి… షోకాజ్ నోటిసుపై ఏమంటారో..?

Exit mobile version