ఎన్నికల వేళ పీవీ నరసింహారావు 120వ జయంతి (PV as Congress target) రాజకీయాన్ని సంతరించుకుంది. భారతరత్న బిరుదును స్వర్గీయ పీవీకి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు నక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానపీఠ్ మార్గ్ వద్ద అంజలి ఘంటించారు. ఆ సందర్భంగా భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ ను కేంద్రం ముందుంచింది. సీఎం కేసీఆర్ స్వర్గీయ పీవీని తెలంగాణ ఠీవీ అంటూ సంభోదించారు. ఆయన నివాళులు తెలియచేశారు. తెలంగాణ బిడ్డ అంటూ కొనియాడారు.
ఎన్నికల వేళ పీవీ నరసింహారావు జయంతి రాజకీయాన్ని సంతరించుకుంది (PV as Congress target)
తెలంగాణ బీజేపీ ఇంచార్జి బండి సంజయ్ తో పాటు పలువురు సీనియర్లు పీవీ ఘాట్ వద్ద అంజలి ఘంటించారు. భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పోటాపోటీగా స్వర్గీయ పీవీ చరిష్మాను కొట్టేయాలని ఎన్నికల వేళ పోటీపడినట్టు కనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా బీఆర్ఎస్ మంత్రులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద క్యూ కట్టారు. ఇప్పుడు పీవీ జయంతి (PV as Congress target) సందర్భంగా ఆయన పట్ల అంకితభావాన్ని చాటుకునేలా ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆఫీస్ కు భౌతికగాయం రాకుండా సోనియా అడ్డుకున్నారని
కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ స్వర్గీయ పీవీ. ఆయన సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీలో పనిచేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చేయడమే కాదు, ప్రధానిగా చేసిన తెలుగోడు. అందుకే, అప్పట్లో పీవీని పోటీచేసిన స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిని పోటీపెట్టకుండా స్వర్గీయ ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకగ్రీవంగా పీవీని ఎంపీ చేయడం ద్వారా ప్రధాని పదవికి వన్నెతెచ్చేలా తెలుగోడికి మరో తెలుగోడు సహకారం అందించారు. కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో అదుకున్నారు పీవీ. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు ఆయన. అలాంటి మహోన్నత లీడర్ పట్ల కాంగ్రెస్ పార్టీ (PV as Congress target) ఉదాసీనంగా వ్యవహరించింది.
స్వర్గీయ పీవీకి సంబంధించిన కార్యక్రమాల్లో సోనియా కనిపించదు(PV as Congress target)
సాధారణంగా మాజీ పీఎం మరణించినప్పుడు ఒక ప్రొటోకాల్ ను ప్రభుత్వంగానీ, పార్టీగానీ పాటించడం ఆనవాయితీ. ప్రభుత్వ పరంగానూ, పార్టీ పరంగానూ పివీకి చనిపోయిన తరువాత గౌరవం దక్కలేదు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు అప్పట్లో ఆయన భౌతికగాయాన్ని తీసుకొచ్చారు. అంత్యక్రియలు హైదరాబాద్ లోనే జరిపారు. ఆ విషయంలోనూ కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని అప్పట్లో వచ్చిన న్యూస్. ఆయన భౌతిక గాయం పూర్తిగా దహనం కావడానికి సరిపడా ఏర్పాట్లు చేయాలేదని కాంగ్రెస్ మీద అప్పట్లో వచ్చిన (PV as Congress target) అపవాదు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆఫీస్ కు భౌతికగాయం రాకుండా సోనియా అడ్డుకున్నారని ఆ పార్టీలోని వాళ్లకు తెలిసిన అంశమే.
కేసీఆర్ వ్యూహాన్ని రచించడం ద్వారా భారతరత్న డిమాండ్
తొలి నుంచి పీవీ పట్ల సోనియా వ్యతిరేక వైఖరితో ఉన్నారని పార్టీలోని అంతర్గత చర్చ. ఆమెను కాదని కాంగ్రెస్ పార్టీని ఇతర చేతుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన వాళ్లు పీవీ ఉన్నారని అనుమానం. అందుకే, పీవీ చనిపోయిన తరువాత ప్రొటోకాల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలను కూడా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు. ఆ తరువాత కూడా ఆయన జయంతి, వర్థంతిలను కాంగ్రెస్ పార్టీ పెద్దగా జరుపుకోదు. ఒక వేళ ఎక్కడైనా జరిపినా నామమాత్రం మాత్రమే. స్వర్గీయ పీవీకి సంబంధించిన కార్యక్రమాల్లో సోనియా కుటుంబం(PV as Congress target) పెద్దగా కనిపించదు. అందుకే, తెలుగోడిగా పీవీని గుర్తించడం ద్వారా బీఆర్ఎస్ రాజకీయంగా లబ్దిపొందుతోంది.
Also Read : CM KCR: కేసీర్ఆర్ బీజేపీ బీ టీమ్?
ప్రస్తుతం పీవీ కుమార్తె వాణిదేవి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆ అవకాశాన్ని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా కల్పించారు. ఇప్పుడు భారత రత్నం పీవీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. స్వర్గీయ పీవీ అంటే ఇప్పటికీ ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. వాళ్లతో పాటు సామాజివర్గం పరంగా బ్రాహణులను ఆకట్టుకునేలా కేసీఆర్ అడుగులు వేశారు. అదే తరహాలో బీజేపీ వేస్తోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం స్వర్గీయ పీవీ పట్ల ఇప్పటికీ (PV as Congress target) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఎన్నికల వేళ మరింత ప్రాధాన్యం ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాన్ని రచించడం ద్వారా భారతరత్న డిమాండ్ ను బయటకు తీసుకొచ్చారు. దానికి నిజంగా కూడా పీవీ అర్హులు.
Also Read : BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!
పాములపర్తి వేంకట నరసింహారావు బేసిక్ గా ఒక న్యాయవాది. భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఆయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఆర్థిక సంస్కరణలను భారత దే
శానికి పరిచయం చేసిన మహోన్నతుడు. మైనార్టీ ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపిన రాజకీయ దురంధరుడు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం చిన్నచూపు చూడడాన్ని బీఆర్ఎస్, బీజేపీ సానుకూలంగా మలుచుకోవడానికి పోటీపడుతూ పీవీ జయంతిని (PV as Congress target) జరుపుతూ, ఘాట్ వద్ద అగ్రనేతలు అంజలి ఘటించడం, భారతరత్నం డిమాండ్ చేయడం ఎన్నికల వ్యూహంలో భాగమే.