Site icon HashtagU Telugu

“Rappa Rappa ” : కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ‘రప్పా రప్పా’ రచ్చ

Ktr Rappa

Ktr Rappa

ఏపీ మాజీ సీఎం జగన్ (Former CM YS Jagan Reddy) ఆ మధ్య పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద ప్లకార్డులు రాజకీయంగా ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా.. రప్పా నరుకుతాం అంటూ వైసీపీ ప్లకార్డులు ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వారిని అరెస్ట్‌ కూడా చేశారు. ఇప్పుడు రప్పా.. రప్పా డైలాగ్ తెలంగాణకు (Telangana) పాకింది.

Kitty Party Aunty : రేవంత్ రెడ్డి ని కిట్టీ పార్టీ ఆంటీతో పోల్చిన కేటీఆర్

ఈరోజు ఖమ్మంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పర్యటన సందర్భంగా ‘2028లో రప్పా రప్పా.. కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం’ అని రాసి ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. ఇటీవల హరీశ్ రావు మీటింగ్లోనూ ఇలాంటి ఫ్లెక్సీనే కనిపించింది. మరి ఈ రప్పా రప్పా డైలాగ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎలాంటి మాటల యుద్ధానికి దారి తీస్తుందో చూడాలి. ఇక కేటీఆర్ ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ పార్టీ పై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి , ఖమ్మం మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆయ‌నేదో పెద్ద అమితాబ్ బ‌చ్చ‌న్ అన్న‌ట్టు రేవంత్ రెడ్డి ఫీల‌వుతున్నాడు.. తిప్పి తిప్పి కొడితే నువ్వు కూడా మూడు ఫీట్లు లేవ‌ని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు.

మా జ‌గ‌దీశ్ రెడ్డిని ప‌ట్టుకుని మూడు ఫీట్లు అన్న‌డు రేవంత్ రెడ్డి. ఆయ‌నేదో పెద్ద అమితాబ్ బ‌చ్చ‌న్ అన్న‌ట్టు. తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు. నువ్వేదో పెద్ద పోటుగాడిలాగా మూడు ఫీట్లు అని డైలాగులు. మ‌న‌ది మ‌నం మ‌రిచిపోతే ఎట్ల‌. కొంచెం ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంప‌ర్ వ‌స్త‌దా..? కొద్దిగా నీకు కూడా టెక్నిక‌ల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తెత్తు షూ వేసుకుని.. ఎత్తెత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడివి అయిపోతావా..? అమితాబ్ బ‌చ్చ‌న్ అయిపోతావా..? అని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిల‌దీశారు.

Rishabh Pant : రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం..

రాష్ట్రంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్న మాట వాస్త‌వం కాదా..? లై డిటెక్ట‌ర్ ముందు కూర్చుని చెప్తావా..? మ‌గాడివి అయితే రా. ద‌మ్ముంటే బ‌య‌ట‌కొచ్చి ఒట్టేసి చెప్పు. చేసేది గ‌లీజ్ ప‌నులు.. మీదికెళ్లి పెద్ద పెద్ద మాట‌లు. ఓ గ‌ల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాట‌లు మాట్లాడిన ముఖ్య‌మంత్రికి ఒక్క‌టే చెప్తున్నా.. ఇప్ప‌టికి 50 సార్లు ఢిల్లీకి పోయావు.. 50 పైస‌లు అయినా వ‌చ్చాయా..? ఢిల్లీకి పోవ‌డం చీక‌ట్లో మోదీ, అమిత్ షా కాళ్లు ప‌ట్టుకోవ‌డం. రాహుల్ గాంధీ ఏమో నిన్ను దేక‌ట్లేదు. అపాయింట్‌మెంట్ ఇస్త‌లేడు అని కేటీఆర్ పేర్కొన్నారు.