KCR : కేసీఆర్ విషయంలో తథాస్తు దేవతలు ..తథాస్తు అన్నారా..?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కష్టపడినా కేసీఆర్ కు ప్రజలు రెండుసార్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇచ్చారు

  • Written By:
  • Updated On - December 5, 2023 / 01:03 PM IST

మ‌నం ఏవైనా మ‌న గురించి మ‌నం చెడుగా అనుకుంటే.. అలా అనొద్ద‌ని.. పైన త‌థాస్తు దేవ‌త‌లు తిరుగుతూ ఉంటార‌ని.. వారు త‌థాస్తు అంటే.. మ‌న‌కు అంతా చెడే జ‌రుగుతుంద‌ని.. క‌నుక వారు తిరిగే స‌మ‌యంలో మ‌నం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడ‌ద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ (KCR) విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.

తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం కోసం కష్టపడినా కేసీఆర్ కు ప్రజలు రెండుసార్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇచ్చారు. కానీ మూడోసారి మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి జై కొట్టారు. గత రెండుసార్లు ఈజీగా అధికారం చేపట్టిన కేసీఆర్..మూడోసారి మాత్రం చాల కష్టపడినప్పటికీ ప్రజలు సపోర్ట్ చేయలేదు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ (KCR Farmhouse) లో కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. దీనిని కేసీఆర్ ముందే ఊహించినట్లు ఉందని అర్ధం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన ఓడిపోతే వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని పదే పదే అన్నారు. ఇప్పుడు ఆయన అన్నట్లే జరిగింది. మొన్నటి వరకు ప్రగతి భవన్ లో రెస్ట్ తీసుకున్న కేసీఆర్..ఇప్పుడు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. కేసీఆర్ ప్రచారంలో అన్న మాటలకు త‌థాస్తు దేవ‌త‌లు త‌థాస్తు అని ఉంటారని..అందుకే ఆలా జరిగి ఉంటుందని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కేసీఆర్ ముందు ముందు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా..? లేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా..లేదా..? అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బయటకు రాలేదు. కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి..ఓటమి గురించి , విజయం సాధించిన కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలిపారు తప్ప కేసీఆర్ ఎక్కడ మీడియా ముందుకు రాలేదు. నిన్న కూడా బిఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల ను తన ఫామ్ హౌస్ కు రప్పించి వారితో చర్చించారు తప్ప బయటకు రాలేదు. ఇక కేసీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాలకు రాం.. రాం.. చెప్పేశారా? మాములుగానే ప్రజలకు అందనంత దూరంగా ఉండే గులాబీ బాస్‌.. ఇక పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితం కానున్నారా? ఇక పార్టీ బాధ్యతలన్ని అయితే కేటీఆర్‌ లేదంటే హరీష్‌ రావే చూసుకోనున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : Chandrababu : చంద్రబాబు కు భారీ ఊరట..