Ration Cards: గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా నిరుపేదలను నిర్లక్ష్యం చేసిందని, అర్హులందరికీ రేషన్ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ్‌నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని, 6 హామీల సంక్షేమం హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్సే పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పథకాలను పొందాలంటే రేషన్‌కార్డు అత్యంత ప్రాధాన్యాంశమని, రేషన్‌కార్డు లేని వారు ఈ 6 హామీలు తమకు వర్తించవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం మొదటగా రేషన్‌కార్డుల జారీ చేయాలనీ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే రేషన్‌కార్డు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను పాల్గొన్నారు.
Also Read: Nara Lokesh : బీసీల ద్రోహి వైఎస్ జగన్ – నారా లోకేష్