Site icon HashtagU Telugu

KTR : కేటీఆర్ కు నిరసన సెగ

Ktr Saibaba

Ktr Saibaba

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (GN Sai Baba) భౌతికకాయానికి నివాళులర్పించడానికి వచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కు నిరసన సెగ తగిలింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా (57) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సాయిబాబాకు గత నెల 28న ఆపరేషన్‌ చేసిన డాక్టర్స్.. గాల్‌ బ్లాడర్‌ను (పిత్తాశయాన్ని) తొలగించి స్టంట్‌ వేశారు. కానీ మరో చోట చీము పట్టడంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. వైద్యులు చీమును తొలగించినప్పటికీ సాయిబాబా పరిస్థితి మరింత క్షిణించి కన్నుమూశారు. సాయిబాబా మృతి పట్ల యావత్ ప్రజానీకం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె మౌలాలిలో సాయిబాబా భౌతిక కాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళ్లు అర్పించడానికి రాగా..ఆయనకు నిరసన సెగ ఎదురైంది. ‘గో బ్యాక్ KTR’ అంటూ సాయిబాబా అభిమానులు, కామ్రేడ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేళ్లుగా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు BRS ఏం చేసిందని ప్రశ్నించారు. నిరసనల నేపథ్యంలోనే కేటీఆర్..సాయిబాబా కు నివాళ్లు అర్పించి.. అక్కడి నుంచి వెనుదిరిగారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్, బాల్క సుమ‌న్, ప‌ల్లె ర‌వి కుమార్, తుల ఉమ‌తో పాటు ప‌లువురు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం బాధాకరం అని కేటీఆర్ పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.

Read Also : Cameron Green: భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు బ్యాడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

Exit mobile version