తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)..రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ (Congress) శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరిస్తూ..బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. నేడు భువనగిరిలో పర్యటించిన ప్రియాంక..కేసీఆర్ మళ్లీ గెలిస్తే భూములు మాయం కావడం పక్క అన్నారు.
‘పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద నేతలు ఫామ్ హౌస్‌లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఎన్నడు నోరు మెదపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు అంతా అవినీతిమయం. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ధనవంతులు అయ్యారు..కానీ ప్రజలు మాత్రం పేదలుగానే మిగిలిపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు రావు.. ధరణి పేరుతో ఉన్న భూమిని మాయం చేస్తారని… తెలంగాణ అప్పులు ఇంకా పదిరెట్లు పెరుగుతాయి’ అని ప్రియాంక విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
రుణాలు మాఫీ కాకపోవంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక సూచించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కావాలనే ఆశ ఉందా..? మీ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాలి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం చూస్తాయి తప్ప . ప్రజల కష్టాలను పట్టించుకోవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలియజేయాలి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోంది. ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే.. ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పై నుంచి కింద వరకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోంది అని ప్రియాంక ఆరోపించారు.
Read Also : Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు