తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ప్రచార సమయం ముంగిపుకు చేరుకోవడంతో ఉన్న ఈ మూడు రోజులు విస్తృతంగా పర్యటించి..ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని అన్ని పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress ) ముందు నుండి కూడా గెలుపు ఫై గట్టి నమ్మకంతో ఉంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని..యువత రోడ్డున పడ్డారని , రైతులు నష్టపోయారంటూ ఆరోపిస్తూ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి..అసలైన తెలంగాణ అంటే ఏంటో చూపిస్తాం అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
లోకల్ నేతల దగ్గరి నుండి జాతీయ నేతల వరకు అంత ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ (Rahul) , ప్రియాంక (Priyanka) లు పర్యటించగా..మరోసారి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధిరలో నిర్వహించిన విజయభేరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొని భట్టి ఫై ప్రశంసల జల్లు కురిపించారు. భట్టి (Bhatti) నియోజవర్గంలో ప్రచారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాహుల్ తరహాలోనే భట్టి కూడా తెలంగాణలో పాదయాత్ర చేశారు.. ఇది సంతోషాన్నిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాహుల్, భట్టి పాదయాత్ర చేశారు. మా అమ్మతో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రాంతం కోసం కాంగ్రెస్ నేతలు సహా చాలా మంది పోరాడారని సోనియా నాతో చెప్పారు. తెలంగాణ కలలు సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా సందేశమిచ్చారు’ అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉంటే తెలంగాణ ప్రజలు కలలు నేరవేరేవని ప్రియాంక అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు తప్పని సరిగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నేరవేర్చలేదని ప్రియాంక మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు.. పండించిన పంటకు సరైన ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెరిగిన ధరలతో మహిళలు ఇబ్బందుకు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని, నిరుద్యోగుల బాధలు ఈ ప్రభుతవ్వానికి పట్టవని నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు.
Read Also : Modi at Kamareddy : తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారు – మోడీ