Site icon HashtagU Telugu

Delhi : సీఎం రేవంత్ కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు

Modi Revanth

Modi Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ), దేశ రాజధాని ఢిల్లీ(Delhi Tour)కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అపాయింట్‌మెంట్ (Appointment) ఖరారైనట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చా అంశంగా ఉండే అవకాశం ఉంది. రేవంత్ దేశంలోనే చట్టబద్ధమైన కులగణనను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందని ప్రస్తావించి, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో దీనిని పొందుపరచాలని మోదీని కోరే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.

OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశముంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఓ జాబితాను హైకమాండ్‌కు సమర్పించనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అంతర్గతంగా కులగణన, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

SLBC Tunnel: ‘సొరంగ’ ప్రమాదానికి రాజకీయ ‘విపత్తు’!

ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఓ స్పష్టతనిస్తే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లకు అనుకూల పరిస్థితులు లేవని, ఈ అంశాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన విషయం, బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.