Site icon HashtagU Telugu

PM Modi-Telangana : ఆగస్టు 6న తెలంగాణకు ప్రధాని మోడీ.. ఎందుకంటే ?

PM Modi-Telangana

Modi

PM Modi-Telangana : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 6న(ఆదివారం) తెలంగాణకు రానున్నారు. “అమృత్ భారత్ స్టేషన్స్” ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణలోని 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు సంబంధించిన పనులను ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 రైల్వే స్టేషన్లను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. తొలుత 21 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్ పనులు పూర్తికాగానే, మిగితా 18 చోట్ల పనులు చేపడతారు. ఇందులో భాగంగా ఆ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు ఉచితి వైఫై వంటి సదుపాయాలను కల్పిస్తారు.

Also read : Beer From Shower Water : షవర్, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో ఆ బీర్ రెడీ

స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు “వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్” షాపులు, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు, స్టేషన్ ముందు, వెనకా మొక్కల పెంపకం, చిన్న చిన్న గార్డెన్లు వంటివి కూడా  “అమృత్ భారత్ స్టేషన్స్”లో  ఏర్పాటు చేస్తారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు (PM Modi-Telangana) ఉంటాయి. రైల్వే  పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ ఫుట్ పాత్ లు, రూఫ్ ప్లాజాలను నిర్మిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను వచ్చే 40 ఏళ్ల అవసరాలను తీర్చగలిగేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూ.715 కోట్లు గతంలోనే కేటాయించారు. చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి కూడా రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

Also read : Anaemia: పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే రక్తహీనత ఎక్కువ.. కారణమిదే..?