Pre Wedding Shoot : వీళ్లు మామూలోళ్లు కాదు..పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్ కి వేదికగా మార్చారు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది కూడా యూనిఫామ్ లోనే వీడియో షూట్ చేశారు. పైగా పోలీస్ వాహనంతో వెడ్డింగ్ షూట్ చేయడం.. మూడు సింహాల బొమ్మను, యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్

Published By: HashtagU Telugu Desk
panjagutta police station Pre Wedding Shoot

panjagutta police station Pre Wedding Shoot

ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్స్ (Pre Wedding Shoot) ఎక్కువై పోతున్నాయి. ఒకప్పుడు పెళ్లి (Wedding) తర్వాత షూట్ చేసేవాళ్లు కానీ ఇప్పుడు పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో నానా హంగామా చేస్తున్నారు. సినిమా రేంజ్ లో సిట్టింగ్స్ , లొకేషన్స్ కోసం చాల దూరం వెళ్లడం..ఇలా బీబత్సం చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం వారి ఏకంగా పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్ కి వేదికగా మార్చారు. ఇలా ప్లాన్ చేసింది కూడా పోలీస్ స్టేషన్ ఎస్సైలే. దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station) పేరు గాంచిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదిక గా మరి విమర్శలు ఎదురుకుంటుంది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా భావన (SI Bhavana) అనే యువతి పనిచేస్తున్నారు. అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా రావూరి కిషన్ (Ravuri Kishan) పని చేస్తున్నారు. కొంత కాలంగా వీరు ఇద్దరు ప్రేమ (Love)లో ఉన్నారు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి(Wedding)కి సిద్ధం అయ్యారు. పెళ్లికి ముందు జరుపుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వారు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ నే వేదికగా మార్చుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station) లో అది కూడా యూనిఫామ్ లోనే వీడియో షూట్ చేశారు. పైగా పోలీస్ వాహనంతో వెడ్డింగ్ షూట్ చేయడం.. మూడు సింహాల బొమ్మను, యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్, బెల్ట్ బకెట్ వంటివి షూట్‌లో భాగం చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారంతా విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

Read Also : Hyderabad : ఈఎస్ఐ హాస్పటల్ లో యువతిపై అత్యాచారం

  Last Updated: 17 Sep 2023, 02:52 PM IST