తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. తాజాగా ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులఅను ప్రజల నుండి తీసుకోబోతుంది. ఈ మేరకు అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రజాపాలన గ్రామ సభల నిర్వాహణపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ.. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సభల్లో.. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని.. ప్రతి దరఖాస్తుదారునికి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయం కేటాయించాలని సూచించారు.
ఇదిలా ఉంటె కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. ప్రజాపాలన సందర్భంగా స్వీకరించే దరఖాస్తులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు.
Read Also : MLC Vamsikrishna Srinivas : జనసేన లోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్..?