Praja Palana : ముగిసిన ప్రజా పాలన..మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా..?

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Praja Palana Program) కార్యక్రమం నేటితో ముగిసింది. ఎన్నికల హామీల్లో భాగంగా రూ.500కే సిలిండర్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు సీఎం […]

Published By: HashtagU Telugu Desk
Praja Palana Program Ended

Praja Palana Program Ended

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Praja Palana Program) కార్యక్రమం నేటితో ముగిసింది. ఎన్నికల హామీల్లో భాగంగా రూ.500కే సిలిండర్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది.

అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంతో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. గత నెల 28వ తేదీ నుంచి ఈరోజు సాయంత్రం వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారు. అభయహస్తం కింద మొత్తంగా 8 రోజులకు గాను కోటి 30 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంటున్నారు. GHMC పరిధిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయని, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ‌ ఇల్లు, చేయూత పథకాల కోసం అర్హుల అప్లికేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో మార్పుల వల్లనో.. లేదా స్థానికంగా అందుబాటులో లేకపోవటం వల్లో చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వలేకపోయారని అధికారులు తెలిపారు. అయితే.. అలాంటి వాళ్లు.. తమకు పథకాలు అందవేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Read Also : YS Sharmila : షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక నిజంగా బాబు హస్తం ఉందా..?

  Last Updated: 06 Jan 2024, 09:25 PM IST