Praja Bhavan : ఇక ప్రజా భవన్..డిప్యూటీ సీఎంకే – చీఫ్ సెక్రటరీ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Dy CM Bhatti Vikramarka ) అధికారిక నివాసంగా ప్రజా భవన్ (Praja Bhavan) ఉండనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్‌ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) వెంటనే ప్రగతి భవన్ (Pragathi Bhavan) ను మహాత్మా […]

Published By: HashtagU Telugu Desk
Prajabhavan Bhatti

Prajabhavan Bhatti

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Dy CM Bhatti Vikramarka ) అధికారిక నివాసంగా ప్రజా భవన్ (Praja Bhavan) ఉండనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్‌ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) వెంటనే ప్రగతి భవన్ (Pragathi Bhavan) ను మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌ (Mahatma Jyothiba Phule Praja Bhavan (formerly Pragati Bhavan) )గా మార్చేసింది. అంతే కాదు ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజలు సమస్యలు తెలుసుకునేలా ప్రజా వాణి కార్యక్రమం చేపట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు ప్రజా భవన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉండేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్‌గా ఉన్న భవనం ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా కొనసాగితే.. ఈసారి అదే బిల్డింగ్ మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌గా మారి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అఫీషియల్ రెసిడెన్స్‌గా మారింది. ఈ భవనాన్ని ఆయన ప్రైవేటు సెక్రటరీకి అప్పగించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా.. నిన్న రాత్రి ప్రజా భవన్ భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపు ఉదయం 8.20కి ఆర్ధిక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. ప్రజా భవన్ లో అధికారిక నివాస భవనంలో ఉండనున్నారు.

ఇక నుంచి డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ కొనసాగనున్నది. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కొత్త క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్‌ ఆఫీస్‌ లేదు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.

Read Also : Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..

  Last Updated: 13 Dec 2023, 03:44 PM IST