Site icon HashtagU Telugu

Rajaiah vs Kadiyam Srihari: ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ పిలుపు.. రంగంలోకి కేటీఆర్

Rajaiah vs Kadiyam Srihari

New Web Story Copy 2023 07 11t123437.639

Rajaiah vs Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీకి తలనొప్పిగా మారారు. రాజయ్య ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్రస్థాయిలో దుమారం లేపాయి. తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య వ్యక్తిగత విమర్శలతో సంచలన కామెంట్లు చేశారు.

కడియం శ్రీహరి తల్లి, కూతురిపై రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆయన అవినీతి తిమింగలం అంటూ వ్యాఖ్యానించాడు. మంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో అందినకాడికి దోచుకుని మలేషియాలో ఆస్తులు కూడబెట్టాడు అంటూ ఆరోపించాడు. అయితే ఎమ్మెల్యే రాజయ్య ఆరోపణలపై కడియం శ్రీహరి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల డెడ్‌లైన్ ఇస్తూ రాజయ్య కుటుంబంపై నేను నోరు విప్పితే ఆయన కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది అన్నారు కడియం శ్రీహరి. ఇదిలా ఉండగా వీరిద్దరి వ్యవహారంపై ప్రగతి భవన్ సీరియస్ అయింది

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య , ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల వ్యవహారం ప్రగతి భవన్ కు చేరింది. వారిద్దరిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ను కలవాలని ఆదేశాలొచ్చాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More: Khajaguda Lake Misery : డంపింగ్ యార్డును తలపించేలా ఖాజాగూడ చెరువు