Site icon HashtagU Telugu

Power War : నోరుజారిన రేవంత్, కాంగ్రెస్లో ఉచిత విద్యుత్ వార్

Power War

Power War

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌ళ్లీ నోరు జారారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ (Power War)ఇవ్వ‌లేమ‌ని తేల్చేశారు. ఆయ‌న అమెరికాలో చేసిన వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విభేదించారు. అధికారంలోకి వ‌స్తే 24 గంట‌ల ఉచిత విద్యుత్ రైతుల‌కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉచిత విద్యుత్ అందించ‌డానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అధ్య‌య‌నం రేవంత్ రెడ్డికి తెలియ‌ద‌ని చుర‌క‌లు వేయ‌డం మ‌రోసారి కాంగ్రెస్ విభేదాలు భ‌గ్గుమ‌నేలా ఉంది.

రైతుల‌కు ఉచిత విద్యుత్  ఇవ్వ‌లేమ‌ని రేవంత్ రెడ్డి..(Power War)

కాంగ్రెస్ మేనిఫెస్టో బ‌య‌ట‌కు రాకుండానే దానిలోని అంశాల‌పై ఆ పార్టీ లీడ‌ర్లు భిన్నాభిప్రాయాల‌తో ఉన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ విష‌యంలోనూ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత‌లు స్పందించారు. అధికారంలోకి వ‌స్తే, ధ‌ర‌ణి పోర్ట‌ల్ ర‌ద్దు చేస్తామ‌ని. రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. పీసీసీ చీఫ్ హోదాలో వ‌రంగ‌ల్ స‌భ‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్ ర‌ద్దుపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. ఆ త‌రువాత భ‌ట్టీ విక్ర‌మార్క్ పాద‌యాత్ర సంద‌ర్భంగా మంచిర్యాల వ‌చ్చిన జాతీయ నేత‌లు మాత్రం ధ‌ర‌ణి పోర్ట‌ల్ ర‌ద్దు ఉండ‌ద‌ని చెప్పారు. దాన్ని స‌రిచేస్తామ‌ని, లోపాల‌ను గుర్తించడం ద్వారా మ‌రింత ప‌గ‌డ్బందీగా  (Power War)కొన‌సాగిస్తామ‌ని వెల్ల‌డించారు.

అధిష్టానం అనుమ‌తిలేకుండా కొన్ని హామీల‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధిష్టానం అనుమ‌తిలేకుండా కొన్ని హామీల‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. మ‌హిళ‌ల‌కు 500ల‌కు సిలిండ‌ర్ ప్ర‌క‌టించారు. కానీ, ఏఐసీసీ మాత్రం మూడు సిలిండ‌ర్ల వ‌ర‌కు ప‌రిమితం చేసింది. ఇలా రేవంత్ రెడ్డి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌లు అంశాల‌పై ఏఐసీసీ మ‌రోలా చెబుతోంది. అంతేకాదు, టిక్కెట్ల ఖ‌రారు విష‌యంలోనూ స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. ఎవ‌రూ టిక్కెట్ల‌ను ప్ర‌క‌టించ‌డానికి లేద‌ని ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిని వారిస్తూ ఏఐసీసీ మాత్ర‌మే అభ్య‌ర్థిత్వాల‌ను ఖరారు చేస్తుంద‌ని ప్ర‌క‌టించింది. సీఎం అభ్యర్థి ఎంపిక‌ విష‌యంలోనూ అధిష్టానం సీరియ‌స్ గా (Power War)అడుగులు వేస్తోంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ప్ర‌మోట్ చేసిన విధంగా భ‌ట్టీకి అండ‌గా ఉంది.

సీనియ‌ర్ల‌ను హోంగార్డుల‌తో పోల్చుతూ త‌న‌కుతాను పొలిటిక‌ల్ ఐపీఎస్

అధిష్టానం నిర్ణ‌యానికి భిన్నంగా సీత‌క్క సీఎం అభ్య‌ర్థి అంటూ అమెరికా వేదిక‌పై పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ‌తంలో సీఎం ప‌ద‌వికి తానే అర్హ‌డ‌నంటూ ప్ర‌క‌టించుకున్నారు. అంతేకాదు, రాజ్యాధికారం `రెడ్డి` సామాజిక‌వ‌ర్గానికి ఉండాల‌ని వ‌న‌భోజ‌నాల సంద‌ర్భంగా  (Power War) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌ను హోంగార్డుల‌తో పోల్చుతూ త‌న‌కుతాను పొలిటిక‌ల్ ఐపీఎస్ మాదిరిగా  క్రియేట్ చేసుకున్నారు. ఆ త‌రువాత నాలుక్క‌రుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత‌ల‌తోనూ కొన్ని సంద‌ర్భాల్లో రేవంత్ రెడ్డి  విభేదించారు. తెలంగాణ రాష్ట్రానికి మాజీ కేంద్ర మంత్రి శ‌శిథ‌రూర్ వ‌చ్చిన సంద‌ర్భంగా వివాద‌స్ప‌ద ట్వీట్లు చేశారు. ఆ త‌రువాత సారీ చెబుతూ వెన‌క్కు త‌గ్గారు.

ప్ర‌స్తుతం ఉన్న గ్రూపుల‌కు అద‌నంగా మ‌రో గ్రూప్ యాడ్ (Power War )

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ల‌ను కాద‌ని ఏక‌ప‌క్షంగా మీటింగ్ లు పెట్టారు. ఆయ‌న వాల‌కం న‌చ్చ‌క‌పోవ‌డంతో ప‌లువురు పార్టీని వీడారు. క‌ర్ణాట‌క ఫ‌లితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ బ‌ల‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో కీల‌కం కావాల‌ని ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టాల‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న గ్రూపుల‌కు అద‌నంగా మ‌రో గ్రూప్ యాడ్ అయిన‌ట్టు (Power War)కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌.

Also Read : Congress CM: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం.. తేల్చేసిన రేవంత్!

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఉప‌యోగ‌ప‌డిన అస్త్రం (Power War)ఉచిత విద్యుత్‌. దానిపై అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు కూడా విభేదించారు. ఉచిత విద్యుత్ ఇస్తే క‌రెంట్ తీగ‌ల‌కు బ‌ట్ట‌లు ఆరేసుకోవ‌డ‌మేనంటూ వ్యాఖ్యానించారు. ఆ స‌మ‌యంలో రేవంత్ రెడ్డి టీడీపీలో కీల‌కంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ గా తెలంగాణ‌కు ఉన్న ఆయ‌న ఉచిత విద్యుత్ ను ఇవ్వ‌లేమ‌ని తేల్చేశారు. గ‌రిష్టంగా 8 గంట‌లు మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌మ‌ని చెప్పారు. ఆ వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ 24 గంటల ఉచిత విద్యుత్ కు క‌ట్టుబ‌డి ఉంద‌ని జ‌రుగుతోన్న న‌ష్టాన్ని స‌రిచేసే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. మొత్తం మీద మ‌రోసారి రేవంత్ రెడ్డి అమెరికాలో నోరుజార‌డం కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం చేకూర్చేలా ఉంది.

Also Read : Revanth Reddy : రేవంత్ ఫెయిల్యూర్ స్టోరీ