KCR – Telangana Gandhi : ‘తెలంగాణ గాంధీ’ అంటూ కామెంట్స్ చేసిన పోసాని

కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని మొదటినుంచీ తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం ఇలా తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు

Published By: HashtagU Telugu Desk
Posani Krishna Murali Sensational comments on Telugu producers

Posani Krishna Murali Sensational comments on Telugu producers

తెలంగాణ సీఎం కేసీఆర్ ‘తెలంగాణ గాంధీ’ (KCR Telangana Gandhi) అంటూ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు సినీ నటుడు , ఏపీ ఫిలిం, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali). మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Polls) జరగనున్నాయి. ఈ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తుందా..లేదా..? అని మాట్లాడుకుంటున్నారు. ఇక బిఆర్ఎస్ (BRS) సైతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి ప్రచారం చేస్తూ తన దూకుడు కనపరుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె బిఆర్ఎస్ మరోసారి అధికారం లోకి రావాలని పలువురు సినీ , బిజినెస్ రంగాల వారు కోరుకుంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఏపీ ఫిలిం, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి మరోసారి తెలంగాణ లో బిఆర్ఎస్ విజయం సాధించాలని , కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరుకున్నారు. తెలంగాణ ఆత్మను అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, మానవతావాది అని, ఆయనను వదులుకోవద్దని, మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని మొదటినుంచీ తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం ఇలా తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. బక్కపలుచగా ఉన్న కేసీఆర్‌ శరీరం సహకరించకపోయినా ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అది ఆయన కమిట్మెంట్‌’ అని, నాడు కేసీఆర్‌కు ఏదైనా అయితే తెలంగాణలో ఒక్కో వ్యక్తి ఒక్కో అగ్నిగోళం అవుతాడని కాంగ్రెస్‌, బీజేపీకి భయం పట్టుకున్నదని, అందుకే తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చాయని చెప్పారు. అందుకే కేసీఆర్‌కు రాష్ట్రం తెచ్చిన ఘనత దక్కిందని పోసాని పేర్కొన్నారు.

Read Also : TS : ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ – KTR

  Last Updated: 08 Nov 2023, 11:27 AM IST