తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను సీఎం రేవంత్ రెడ్డి కలవడం ఫై బిఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు. గత గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగిన సంగతి తెలిసిందే. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇక కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున పార్టీ నేతలు , శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు హాస్పటల్ కు వెళ్లి పరామర్శిస్తూ వస్తున్నారు.
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ..యశోద హాస్పటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని కోరారు. కేసీఆర్ ను రేవంత్ కలవడం ఫై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఇది శుభపరిణామమని, రాజకీయాలతో సంబంధం లేకుండా రేవంత్ స్వయంగా వెళ్లి పరామర్శించడం ఎంతో గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాత్రం రేవంత్ కలవడం ఫై సెటైర్లు వేసి..విమర్శల పాలవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రేవంత్ రెడ్డి పరామర్శ ఫొటోలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని సెటైరికల్ క్యాప్షన్ ఇచ్చారు పొన్నాల. నన్ను కనీసం ఏడాది పాటు అయినా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్ గారు.. అంటూ వేడుకుంటున్నాడని క్యాప్షన్ ఇచ్చారు పొన్నాల. పొన్నాల పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పలువురు నెటిజన్స్ పొన్నాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె కొద్దీ సేపటి క్రితం సినీ నటుడు ప్రకాష్ రాజ్..కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తో పాటు కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి., చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు ఉన్నారు.
Read Also : Salaar Censor Talk : సలార్ సెన్సార్ టాక్