Site icon HashtagU Telugu

Uttam Vs Ponnala : ఉత్తమ్ వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్..ఎవరి మాట నిజం..?

Uttam Poonnala

Uttam Poonnala

తెలంగాణ (Telangana )లో లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికల వేడి కాకరేపుతుంది. అధికారపార్టీ కాంగ్రెస్ (Congress) – బిఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య మాటల వార్ ముదురుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)..లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత పొన్నాల (Ponnala ) కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని.. కేసీఆర్ (KCR) అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ,104 మంది ఎమ్మెల్యేల బలం నుండి 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య కౌంటర్ ఇచ్చారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ఉత్తమ్ అంటున్నారని పొన్నాల చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా? అని ప్రశ్నించారు. మంత్రుల మాటల్లో ఆవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం ఉన్నాయన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా అని నిలదీశారు. మరి వీరిద్దరి మాటల్లో ఎవరి మాటలు నిజం అనేది ప్రజలే తెలుసుకోవాలి.

Read Also : IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు