IT Rides : తనను భయపెట్టి, ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ – పొంగులేటి

తాను నామినేషన్ వేసే రోజున ఉద్దేశపూర్వకంగానే తనను భయపెట్టేందుకే తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు చేస్తున్నారని ఆరోపించారు

Published By: HashtagU Telugu Desk
Ponguleti

Ponguleti

ఐటీ రైడ్స్ (IT Rides) ఫై పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తనను భయపెట్టి, ఇబ్బంది పెట్టేందుకు ఐటీ, ఈడీ అధికారుల దాడులని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం (Elections Time) దగ్గర పడుతున్న టైములో వరుసపెట్టి కాంగ్రెస్ నేతల (Congress Leaders) ఇళ్లపై , ఆఫీసుల ఫై ఐటీ రైడ్స్ జరగడం కుట్రపూరితమేనని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీ (BRS) నేతలను , బిజెపి (BJP)నేతలను వదిలిపెట్టి కేవలం కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేయడం ఏంటి అని సదరు కార్యకర్తలు ప్రశ్నింస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ఉదయం నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇళ్లపై , ఆఫీస్ లపై పెద్ద ఎత్తున ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. 8 వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు.. సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తన ఇల్లు, ఆఫీసులపైనా ఐటీ దాడులు జరగవచ్చని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారమే ఆరోపించారు. పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలైనా కాకుండానే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. ఉదయం 3 గంటల నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

ఈ రైడ్స్ ఫై పొంగులేటి స్పందించారు. తాను నామినేషన్ వేసే రోజున ఉద్దేశపూర్వకంగానే తనను భయపెట్టేందుకే తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తనను విమర్శించిన వారిని ఇబ్బంది పెట్టడం సీఎం కేసీఆర్ (Cm Kcr) కు అలవాటేనని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినందునే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also :  KCR Nomination : గ‌జ్వేల్‌లో నామినేష‌న్ వేసిన కేసీఆర్

  Last Updated: 09 Nov 2023, 12:05 PM IST