Site icon HashtagU Telugu

Ponguleti Srinivas Reddy: జనగర్జనలో గర్జించిన పొంగులేటి

Congress Rahul Khammam

Congress Rahul Khammam

Ponguleti Srinivas Reddy: జనగర్జన సభలో కాంగ్రెస్ నేతలు గర్జించారు. రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్తూ రెండు సార్లు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలోకి పంపించాలి ఆంటే అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు.

కెసిఆర్ మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారం చేపట్టి రైతుల్ని, నిరుద్యోగుల్ని నట్టేట ముంచారన్నారు. ఏ రాష్ట్రంలో జరగనివిధంగా తెలంగాణాలో దాదాపు 8 వేల మంది రైతులు ఉరితాడుకు వేలాడారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను గంగలో కలిపాడని, నిరుద్యోగులకు ఇస్తానని నమ్మబలికిన నిరుద్యోగభృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ డిక్లరేషన్ పేర్కొన్న ప్రతి అంశాన్ని నిరవేరుస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఖమ్మం సభపై కెసిఆర్ అనేక విధాలుగా కుట్ర చేశారన్నారు. వారం రోజుల నుంచి ఖమ్మం సభకు వచ్చేవారిని ఎలా అడ్డుకోవాలో లెక్కలేసుకున్నారని ఆరోపించారు. అయినప్పటికీ అధికార పార్టీ దుందుడుకు స్వభావాన్ని భరించి సభను విజయవంతం చేసినందుకు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు చేరాడో క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చేది కాంగ్రెస్ మాత్రమేనని, అందుకే తెలంగాణ ప్రజలు నన్ను కాంగ్రెస్ లోకి వెళ్లాలని కోరినట్లు, ప్రజల కోరిక మేరకే తాను కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read More: Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ