Site icon HashtagU Telugu

Ponguleti Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti

Ponguleti

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచి మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఈయన కు కాంగ్రెస్ ఇరిగేషన్ శాఖ (Irrigation minister in telangana) బాధ్యతను అప్పగించింది. శ్రీనివాస్ రెడ్డి 1959, నవంబరు 4న రాఘ‌వ‌రెడ్డి, స్వ‌రాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా, కల్లూరు మండలంలోని నారాయణపురంలో జన్మించాడు. వ్యవసాయదారుడిగా పనిచేశాడు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తిచేశాడు.

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ, వివిధ హోదాల్లో పనిచేశాడు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.

We’re now on WhatsApp. Click to Join.

2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో, 2019 17వ లోకసభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాడు. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆయన 2023 జులై 2న ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా, రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. ఆయన 2023 జులై 14న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పాలేరు నుండి విజయం సాధించారు.

Read Also : Sridhar Babu Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు