Ponguleti Srinivas Reddy: గాంధీభవన్ లో తొలి సారిగా అడుగుపెట్టిన పొంగులేటి

తెలంగాణ కాంగ్రెస్ లో చేరిన తరువాత మొదటిసారిగా గాంధీభవన్ లో అడుగు పెట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy).

Ponguleti Srinivas Reddy: ఎన్నికలు సమీస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయ జోరు ఊపందుకుంది. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. ఈ క్రమంలో ఎవరికీ వారు రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ లో చేరిన విషయమే. ఖమ్మం సభావేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో చేరిన తరువాత మొదటిసారిగా గాంధీభవన్ లో అడుగు పెట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy). ఈ మేరకు ఆయనను సాదరంగా ఆహ్వానించి సత్కరించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో.. కేసీఆర్ విముక్త్ తెలంగాణలో భాగంగా శీనన్న లాంటి నాయకులు సేవలు ఎంతో అవసరం. మా అందరి లక్ష్యం ఒక్కటే కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అంటూ పోస్ట్ పెట్టారు.

Also Read: CM Jagan : జ‌గ‌న్న‌న్న తోడు నిధులు విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంగా దూకుడు పెంచింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో కాంగ్రెస్ లో భారీ చేరికలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణాలో ఇందిరమ్మ పాలన తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం పని చేస్తుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు రేవంత్. ఇక తాజాగా కాంగ్రెస్ లో పొంగులేటి చేరడంతో ఖమ్మంలో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోందని చెప్తున్నారు రాష్ట్ర నాయకులు.

Also Read: Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్ల‌లో సలార్ రిలీజ్!