TS Polls 2023 : 72 నుండి 78 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం – పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అధికార బీఆర్ఎస్ నేతలకు తెలుసునని, అందుకే వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకొచ్చారు

Published By: HashtagU Telugu Desk
IT Raids On Ponguleti

Shock To Ponguleti

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మరోసారి గెలుపు ఫై ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ (Congress)..ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టి..ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లని చూస్తుంది. రాష్ట్ర ప్రజలు సైతం ఈసారి మార్పు కోరుకుంటున్నారని..అందుకే మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ బలం బాగా పెరిగింది. ఆరు గ్యారెంటీ హామీలతో ప్రజలనే కాదు ఇతర పార్టీలను సైతం ఆకట్టుకుంది. దీంతో అనేక పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరి..ఎన్నికల బరిలో నిల్చున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పాలేరు నుండి పోటీ చేస్తున్న పొంగులేటి..కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేసారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అధికార బీఆర్ఎస్ నేతలకు తెలుసునని, అందుకే వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తుంది..మీము ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ 72 నుంచి 78 సీట్లలో గెలిచి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మరోసారి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.

Read Also : TDP : జ‌గ‌న్ రెడ్డికి ఓటమి భయంతోనే ఈ అక్ర‌మ అరెస్టులు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా

  Last Updated: 15 Nov 2023, 09:34 PM IST