Political Tweet : రాజ‌కీయ యుద్ధంలోకి `స్మితాస‌బ‌ర్వాల్ ` 

స్మితా స‌బ‌ర్వాల్ కు రాజ‌కీయ రంగు ( Political Tweet )తాకుతోంది. ఆమె చేస్తోన్న ట్వీట్లు వ్య‌వ‌హారాన్ని ర‌ఘునంద‌న్ రావు ఎత్తిచూపుతున్నారు.

  • Written By:
  • Updated On - July 24, 2023 / 05:23 PM IST

తెలంగాణ సీఎం ఆఫీస్ లో కీల‌క అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ కు రాజ‌కీయ రంగు ( Political Tweet )తాకుతోంది. ఆమె చేస్తోన్న ట్వీట్లు వ్య‌వ‌హారాన్ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఎత్తిచూపుతున్నారు. దేశంలోని బీజేపీ పాలితిరాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఘ‌ట‌న‌ల‌పై స్పందించడాన్ని ఆహ్వానిస్తూ తెలంగాణ‌లోని ఘోరాల‌పై ఎందుకు రియాక్ట్ కావ‌డంలేదని ప్ర‌శ్నించారు. దీంతో స్మితా స‌బ‌ర్వాల్ చేస్తోన్న ట్వీట్ల‌కు రాజ‌కీయ రంగు పులుముకుంటోంది.

స్మితా స‌బ‌ర్వాల్ తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌లో కీల‌క ఐఏఎస్ అధికారిణి ( Political Tweet )

తొమ్మిదేళ్లుగా ( Political Tweet )స్మితా స‌బ‌ర్వాల్ తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌లో కీల‌క భాగ‌స్వామి. ఐఏఎస్ అధికారిణిగా కీల‌క బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. తొలుత క‌లెక్ట‌ర్ గా ఆ త‌రువాత సీఎంవో ఆఫీస్ లో అత్యంత కేంద్రబిందువుగా ప‌నిచేస్తున్నారు. రాష్ట్రంలోని ప‌లు దాష్టీకాల‌ను ఆమెకు తెలియ‌న‌వికాదు. గ‌త తొమ్మిదేళ్లుగా ఎంత మంది జ‌ర్న‌లిస్ట్ ల‌ను జైలుకు పంపారు? అనేది కూడా తెలుసు. సోష‌ల్ మీడియా పోస్టుల‌ను షేర్ చేసిన వాళ్ల‌పై రాజద్రోహం కేసు పెట్టి అణ‌చివేసే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేసింది. కొంద‌రు జ‌ర్న‌లిస్ట్ ల‌ను రాత్రిరాత్రి తెలంగాణ పోలీసులు కిడ్నాప్ చేసిన‌ట్టు తీసుకెళ్లారు. మ‌హిళ‌ల కిడ్నాప్, రేప్ లు గ‌త తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో జ‌రిగాయి. ద‌ళితుల‌పై జ‌రిగిన దాడులు అనేకం ఉన్నాయి. ఏనాడూ వాటి మీద స్మితా స‌బ‌ర్వాల్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా స్పందించ‌లేదు.

రాష్ట్రంలోని ప‌లు దాష్టీకాలు   స్మితా స‌బ‌ర్వాల్  తెలియ‌న‌వికాదు

క‌రోనా స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న ఎలా ఉంది? అనేది అంద‌రికీ తెలుసు. సాక్షాత్తు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ప‌లుమార్లు తెలంగాణ ప్ర‌భుత్వ వాల‌కాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఆస్ప‌త్రులు దోచుకునేందుకు స్వేచ్చ‌నిచ్చారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క‌రోనా స‌మ‌యంలో ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను సైతం ఆధీనంలోకి తీసుకుని మెరుగైన వైద్యం అందించింది. కానీ, తెలంగాణ స‌ర్కార్ మాత్రం 70లక్ష‌లు బిల్లు వేసిన ఆస్ప‌త్రుల‌ను కూడా ప‌ట్టించుకోలేదు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు స‌మైక్య రాష్ట్రంలో కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. ద‌ళితుల‌పై దాడులు , రైతు ఆత్మ‌హ‌త్య‌లు, మ‌హిళ‌ల‌పై అరాచ‌కాలు, కిడ్నాప్ లు, రేప్ లు తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో జ‌రిగాయి. ఇక డ్ర‌గ్స్, భూ కుంభకోణాలకు అంతేలేదు. అధికారుల‌పై పెట్రోలు పోసి త‌గుల‌బెట్టిన సంఘ‌ట‌న‌లు కేసీఆర్ జ‌మానాలో ఎన్నో. వాటి మీద ఒక్క‌సారి కూడా స్మిత ట్విట్ ( Political Tweet ) చేయ‌లేదు.

స్మితా స‌బ‌ర్వాల్  చేస్తోన్న ట్వీట్లు వ్య‌వ‌హారాన్ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

జ‌ర్న‌లిస్ట్ ల‌కు రాజ్యాంగం క‌ల్పించిన స్వేచ్ఛ‌తో మ‌ణిపూర్ సంఘ‌ట‌న‌ల‌ను బ‌య‌ట‌కు తేవాల‌ని ఆమె కోరుకున్నారు. ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న ఐఏఎస్ స్మిత చేసిన ట్వీట్ ను ఆహ్వానించాల్సిందే. అదే స‌మ‌యంలో తెలంగాణ ప‌రిపాల‌న గురించి కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించి ఉంటే ప్ర‌శంస‌లు అందేవి. ప‌లు సంద‌ర్భాల్లో స్మితా స‌బ‌ర్వాల్ బీజేపీ రాష్ట్రాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై ట్వీట్ట‌ర్ వేదిక‌గా వివాద‌స్ప‌దం అయ్యారు. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో క్ష‌మాప‌ణ కూడా చెప్పారు. ఇప్పుడు అవే అంశాల్ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు బ‌య‌ట‌కు.( Political Tweet ) తీసుకొచ్చారు.

Also Read : Smitha Sabharwal : బిల్కిస్ బానో రేప్ నుంచి మ‌ణిపూర్ దాకా `ఐఏఎస్ స్మితా`వార్‌

మణిపూర్ లోని హింసాకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేశారని, ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తోందని స్మితాస‌బ‌ర్వాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు. ఆ ట్వీట్ ను రాష్ట్రపతికి కూడా ట్యాగ్ చేశారు. రాజ్యాంగపరమైన అధికారాలను అమలు చేయాలని కోరారు. ప్ర‌తిగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై మాత్ర‌మే స్మితా సభర్వాల్ సత్వరమే స్పందిస్తుంటారని, మీరు బాధ్యతలను నిర్వర్తిస్తున్న తెలంగాణలో జరిగిన దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నామని హిత‌వు పలికారు. నల్గొండ జిల్లాలో ఒక దళిత మహిళా సర్పంచ్ పై రక్తం వచ్చేలా దాడి చేశారని, దీనిపై స్పందించాలని ట్విట్ట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేయ‌డం స్మితాస‌బ‌ర్వాల్ ట్వీట్.రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది.

Also Read : Smitha Sabharwal : ఐఏఎస్ స్మితా స‌బ‌ర్వాల్ కు ఎదురుదెబ్బ!