Site icon HashtagU Telugu

Ganesh Shobha Yatra : పవన్ పాటకు దుమ్ములేపే స్టెప్స్ తో అదరగొట్టిన తెలంగాణ పోలీసులు

Police Teenmar Steps

Police Teenmar Steps

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో గురువారం తెల్లవారు జామునుండే గణేష్ నిమజ్జన (Ganesh Shobha Yatra) కార్యక్రమాలు మొదలయ్యాయి. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాలనుండి భారీ ఎత్తున భక్తులు , ప్రజలు టాంక్ బండ్ కు చేరుకొని గణేష్ నిమజ్జన కార్యక్రమాలను తిలకిస్తూ వస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం సైతం గణేష్ నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ తరఫున 2 వేల వాహనాలు, జీహెచ్‌ఎంసీ 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మంది సిబ్బందిని నియమించారు. 50 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు.

ఇక భారీ బందోబస్తులో భాగంగా పోలీసులు (Police) భద్రత ఏర్పాట్లే కాదు..డీజే పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. శోభాయాత్రలో అనేక చోట్ల పోలీసులు చేసిన డ్యాన్స్‌ హైలెట్ గా నిలిచింది. ఎప్పుడు సీరియస్ గా కనిపించే పోలీసులు తమతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడంతో భక్తులు మరింత ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసుల డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఉత్సవం ఏదైనా.. ప్రశాంతంగా నిర్వహించడం తెలంగాణ పోలీసులకే సాధ్యం అంటూ కితాబిస్తున్నారు.