CM KCR: కేసీఆర్ కోసం అంబులెన్స్ ఆపేశారు

అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే

CM KCR: అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే కాకుండా పబ్లిక్ ట్రాఫిక్ ని క్లియర్ చేయడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కానీ మన సమాజానికి రాజకీయం అనే ఒక మసి అంటుకుంది కదా. రాజకీయ నాయకులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్ళకి రూల్స్ ఉండవు, నిబంధనలు ఉండవు. వాళ్లదే రాజ్యమన్నట్టు తయారైంది.

ఒక అంబులెన్స్ కి దారి ఇవ్వని పోలీసులు సమాజాన్ని ఇంకేం కాపాడుతారు. రాజకీయ నాయకులకు సలాం కొట్టే ఖాకీలు ప్రజల కోసం పని చేస్తారనుకోవడం తప్పే. తెలంగాణాలో పోలీసులు కేవలం రాజకీయ నాయకులకు సెక్యూరిటీగా మారిపోయారు. సీఎం కాన్వాయ్ వస్తుందన్న సాకుతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్న అంబులెన్స్ ని అడ్డుకున్న ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది.

తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ రోజు అనేక పర్యటనలు చేపట్టారు. అయితే ఆయన పటాన్చెరు నుంచి వస్తున్నాడని తెలిసి గంటల తరబడి ట్రాఫిక్ ని నిలిపివేశారు. దీంతో ప్రజలు గంటల పాటు రోడ్లపై వేచి ఉన్నారు. ఇక అంబులెన్స్ కి దారి ఇవ్వాలని పాప తల్లి మొరపెట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. పాప అనారోగ్యంతో ఉందని, త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వేడుకొన్నప్పటికీ వాళ్ళు కనికరించలేదు. దీంతో స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు.

Read More: Devara : ‘దేవర’లో మరో విలన్.. ఎన్టీఆర్ కోసం మలయాళం స్టార్..